Thursday, March 21, 2019

కల్హేర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడి గా బీబీపేట్ సర్పంచ్ రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్ష పదవికి కల్హేర్ సర్పంచ్ పెరుమాండ్ల లచ్చవ్వ-బాలయ్య  గారిని ఎన్నుకొని మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారిని కలవడం  జరిగింది.తదుపరి కార్యక్రమంలో ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మన నియోజకవర్గంలో నీటి ఎద్దటి ఉన్నందున ప్రతి గ్రామంలో సర్పంచ్ లు మిషన్ భాగిరథ ద్వార గాని బోరు బావుల ద్వార గాని నీటి సదుపాయం చేసే అవకాశం ఉంటె తదితర శాఖా వారి సమన్వయంతో ప్రజలకు నీరు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరం నీటిని ఆదా చేస్తూ ఎదుటి వారికీ ఆదర్శంగా నిలుదాం.రేపు జరగాబోయే MLC ఎన్నికలకు పార్టీ సంబందిత అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా,మరియు ముందు రాబోయే పార్లమెంటరి ఎన్నికలలో పార్టీ నిర్నహించిన అభ్యర్థికి అధిక మెజారిటి గెలిపించాలని కోరారు.అనతరం సర్పంచ్ ల ఫోరం అధ్యకుడిగా ఎన్నికైన రవీందర్ రెడ్డి మరియు వారి ఫోరం ను  సన్మానించిన మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.







No comments:

Post a Comment