కల్హేర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడి గా బీబీపేట్ సర్పంచ్ రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్ష పదవికి కల్హేర్ సర్పంచ్ పెరుమాండ్ల లచ్చవ్వ-బాలయ్య గారిని ఎన్నుకొని మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది.తదుపరి కార్యక్రమంలో ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మన నియోజకవర్గంలో నీటి ఎద్దటి ఉన్నందున ప్రతి గ్రామంలో సర్పంచ్ లు మిషన్ భాగిరథ ద్వార గాని బోరు బావుల ద్వార గాని నీటి సదుపాయం చేసే అవకాశం ఉంటె తదితర శాఖా వారి సమన్వయంతో ప్రజలకు నీరు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరం నీటిని ఆదా చేస్తూ ఎదుటి వారికీ ఆదర్శంగా నిలుదాం.రేపు జరగాబోయే MLC ఎన్నికలకు పార్టీ సంబందిత అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా,మరియు ముందు రాబోయే పార్లమెంటరి ఎన్నికలలో పార్టీ నిర్నహించిన అభ్యర్థికి అధిక మెజారిటి గెలిపించాలని కోరారు.అనతరం సర్పంచ్ ల ఫోరం అధ్యకుడిగా ఎన్నికైన రవీందర్ రెడ్డి మరియు వారి ఫోరం ను సన్మానించిన మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.
Thursday, March 21, 2019
నారాయణఖేడ్ మండలంలోని ర్యాకల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బోయిని విట్టల్ అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబీకులకు అన్ని విధాల తానై ఆదుకుంటనని మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు బరోసాను అందించారు. మన ప్రభుత్వం రైతు భీమా పథకం ద్వార అందించే 5,00,000/- రూపాయలను వారి బ్యాంకు ఖాతా లో జమచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా SC,ST విజిలెన్సు కమిటీ మెంబెర్ రాథోడ్ రవీందర్ నాయక్ గారు పాల్గొన్నారు.
ఎన్నెన్నో పత్రికలు విరాజిల్లుతున్న ఈ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండేలా వారి పత్రిక విలువలను నూతన పోకదాలతో ఈ హొలీ పర్వదినమున వారి పత్రిక పేరు లో ఉన్న విధంగా వెలుగొందలనికోరుతూ మన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా వెలుగు దినపత్రిక జిల్లా ఏడిషన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు దినపత్రిక విలేకరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐదవ తనానికి,పవిత్రతకు నిదర్శనం ఆనాడు సీతమ్మ అగ్ని ప్రవేశం చెయ్యడం.ఆ తదుపరి పరిణామాల్లో రావణాసురుడి సతీమణి మండోదరి తన ఐదవ తనానికి,నుదుటి తిలకం పోకుండా శ్రీరామ చంద్రుడు ఇచ్చిన ఆదేశానుసరమూ వలన ప్రతి సంవత్సరం కమదహణం చేయటం జరుగుతుంది. ఆ విధంగా మండోదరి ఐదవ తనంతో జీవించింది.అలనాటి గ్రంథాల ప్రతీతి ఇలా... నియోజక వర్గ ప్రజలందరూ ఈ హొలీ పండగలో రంగు-రంగుల్లో తమ జీవితాలను రంగుల మాయం మరియు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
మరొక్క సారి నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు...
గౌరవ శాసన సభ్యులు కార్యాలయం,
నారాయణఖేడ్.
మరొక్క సారి నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు...
గౌరవ శాసన సభ్యులు కార్యాలయం,
నారాయణఖేడ్.
Monday, March 18, 2019
నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ రోడ్డు దగ్గర గల హజ్రత్ ఖాజాషా సయ్యద్ మొహ్మేద్ పీర్ షాదుల్ చిష్తి రెండవ గంధాల వార్షికోత్సవానికి హజారైన మనందరి మనస్సుఎరిగిన నేత జగజ్జేతమన గౌరవ శాసన సభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.తదుపరి దర్గాలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతనలు నిర్వహించారు. ఎమ్మేలే గారిని దర్గా పీటాదిపతి హజ్రత్ ఖాజా షా మొహ్మేద్ షాదుల్ పీర్ చిష్తి సన్మానించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆ దర్గా పెద్దలు నాయకులూ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)