Monday, June 25, 2018
ఖేడ్ గౌరవ శాసన సభ్యులు శ్రీ యం .భూపాల్ రెడ్డి గారు మనూర్ మండలం దోసపల్లి ప్రాథమిక పాఠశాలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చెయ్యగా అక్కడి పాఠశాలలో పిల్లలు కాని,టీచర్ ఆశీర్వాదం కానీ,వంట మనిషి కూడా పాఠశాలలో లేరు.అక్కడ ఉన్న హాజరు రిజిస్టర్ ను పరిశీలించి గ్రామస్తులకు విద్యార్థుల పేర్లు చదివి వినిపించగా ఈ పాఠశాలలో ఎవ్వరు చదవరు అని చెప్పినారు, టీచర్ కూడా రోజు పాఠశాలకు రారు అని చెప్పినారు..మధ్యాహ్న భోజన రిజిస్టర్ పారిశీలించగా 18 మందికి వంట చేసినట్టు రాశి ఉంది..ఏ ఒక్క విద్యార్థి లేరు ఇట్టి విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపి బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి గర్లకు పిర్యాదు చెయ్యడం జరిగింది..ఎమ్మెల్యే గారితో పాటుగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి గారు.గణపతి గారు,రాజశేఖర్ రెడ్డి గారు,జగ్గప్ప గార్లు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment